- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anmol: ఆప్ ఎమ్మెల్యే రాజీనామా.. హృదయం బరువెక్కిందంటూ భావోద్వేగ పోస్ట్
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ (Anmol Gagan Maan) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘నా హృదయం బరువెక్కింది. పాలిటిక్స్ వీడాలని నిర్ణయించుకున్నా. అందుకే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. స్పీకర్ నా రిజైన్‌ను ఆమోదించాలి. పార్టీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, అన్మోల్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రి పదవి దక్కింది. కానీ 2024లో కేబినెట్‌లో మార్పులు చేయడంతో ఆమెను పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి అన్మోల్ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.






