- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో ఈడీ ముందుకు అనిల్ అంబానీ.. PMLA యాక్ట్ కింద స్టేట్‌మెంట్ రికార్డు
మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో నేడు విచారణ హాజరుకావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో నేడు విచారణ హాజరుకావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో అనిల్ అంబానీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ మేరకు ముంబైలో నివాసం ఉంటున్న ఆయన ఢిల్లీకి బయలదేరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఇవాళ అనిల్ అంబానీ ఇచ్చే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్ట్ చేయనున్నారు. అదేవిధంగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొంత మంది ఎగ్జిక్యూటివ్‌లకు కూడా నోటీసుల జారీ చేసే అవకాశం ఉంది.
అయితే, వారం క్రితం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన 50 కంపెనీల్లో మొత్తం 35 ప్రాంతాల్లో, 25 మంది ఇళ్లో ఈడీ విస్తృతంగా ఆకస్మిక తనఖీలు చేపట్టింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని దాదాపు రూ.17వేల కోట్లకు పైగా నిధులను షెల్ కంపెనీలకు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.






