- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 ఏళ్లు పెంచితే.. నేలమట్టం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. వృద్ధురాలి కన్నీటి ఆవేదన
ప్రకృతిలో గడిపితే ఆ ఆనందమే వేరు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రకృతిలో గడిపితే ఆ ఆనందమే వేరు. మనసు ప్రశాంతంగా ఉండటానికి చాలా మంది ప్రకృతితో మమేకమవుతుంటారు. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అయితే, ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మంది ఆఫీస్‌కి, ఇంటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. పచ్చని మైదానంలోకి వెళ్లి గడపడానికి తీరిక ఉండటం లేదనడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, నగరంలో నివసించే వాళ్లు ఎప్పుడో ఒకసారి అలా కుటుంబంతో కలిసి పార్క్‌లకు వెళ్తుంటారే తప్ప పచ్చని పొలాల వద్దకు వెళ్లాలేరు కదా. కానీ పల్లెల్లో పచ్చని వాతావరణం అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది.
అలాగే, గ్రామాల్లో పర్యావరణ ప్రియులు కూడా ఎక్కువే. చెట్లు, నేల, నీరు, గాలి, మొక్కలు, జంతువులు ఇలా ప్రతి దానిని విపరీతంగా ప్రేమిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఆశ్చర్యమైన ఘటన వెలుగు చూసింది. విషయంలోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌లోని సరగొండిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 20 ఏళ్ల క్రితం ఒక తల్లి ప్రేమతో నాటిన చెట్టును నరికేశారు. తన బిడ్డలా పెంచిన ఆ చెట్టు కళ్లెదుటే కూలిపోవడంతో ఆ వృద్ధురాలు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కదిలించింది. ప్రకృతి పై ఆమెకున్న మమకారాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ ఘటన పై గ్రామస్తులు సైతం నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రకృతి ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






