Amith shah: 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు.. కేంద్ర మంత్రి అమిత్ షా

by B.Srinivas |

2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

Amith shah: 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు.. కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉమెన్ రిజర్వేషన్‌తోనే జరుగుతాయని, నారీ శక్తి వందన్ అధినియం (Nari Shakti Vandan Adhiniyam) బిల్లును అమలు చేస్తామన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. చట్టసభల ప్రక్రియలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. దీని వల్ల ఎవరినీ అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ జరిగినప్పుడు ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాబోరని, పూర్తి సమతుల్యతను పాటిస్తామని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కారణంగానే డీఎంకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. కానీ అప్పటికీ డీలిమిటేషన్ జరగబోదని ఈ విషయం వారీకీ తెలుసన్నారు.

Next Story