- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: పీఓకేను వెనక్కి తీసుకుంటాం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఆపరేషన్ సిందూర్‌పై బుధవారం కూడా రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌పై బుధవారం కూడా రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పీఓకేను పాకిస్థాన్‌కు అప్పగించిందని, బీజేపీ దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని నొక్కి చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల తలలపై కాల్పులు జరపాలని ప్రజలు డిమాండ్ చేశారని, వారు కోరుకున్నట్టే దాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల తలలపై తూటాలు దించామన్నారు. శ్రీనగర్ సమీపంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించింది పహెల్గాం ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు. కశ్మీర్ త్వరలోనే ఉగ్రవాదం నుంచి విముక్తి పొందుతుందని హామీ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లొంగిపోతేనే సీజ్ పైర్ కు ఒప్పకున్నామని, ఎవరి మధ్య వర్తిత్వం లేదని స్పష్టం చేశారు.
భారత్ గతంలో పాకిస్తాన్‌కు పత్రాలను మాత్రమే పంపిందని, కానీ ఈసారి నరేంద్ర మోడీ వాటికి వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్‌తో సమాధానం ఇచ్చారని తెలిపారు. తద్వారా దాయాదిలో భయం నెలకొందన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు మాత్రమే పాల్పడుతోందని, జాతీయ భద్రతపై వారు ఏ మాత్రం ఆలోచించడం లేదని ఆరోపించారు. తాము పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తుంటే వారు తమ దేశంపై దాడులు చేస్తున్నట్టు గానే భావించారని విమర్శించారు. అయితే హోంమంత్రి ప్రసంగానికి ముందు కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ప్రధాని మోడీ సభకు ఎందుకు హాజరు కాలేదని, చర్చకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసింది.






