- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: మోడీ హయాంలోనే దేశం సురక్షితం.. కేంద్ర మంత్రి అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే దేశం సురక్షితంగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ హయాంలోనే దేశం సురక్షితంగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. భారత్‌లో రక్తం చిందించడానికి తాము అనుమతించబోమని, అలా చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న అమిత్ షా లక్నోలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) తో భారత్ ప్రపంచ వ్యాప్తంగా సందేశాన్ని పంపిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి రోజూ ఉగ్రదాడులు జరిగేవని తెలిపారు. ఎనాడూ వాటికి ప్రతిస్పందించలేదని విమర్శించారు. కానీ మోడీ పాలనలో మూడు సార్లు దాడులు చేశామని గుర్తు చేశారు. ‘మెట్రో నెట్‌వర్క్‌ల ద్వారా పేదరికాన్ని తగ్గించడం, అంతరిక్ష సాంకేతికత, విద్య, విమానయానం, యువతకు అవకాశాలు, కంప్యూటర్ ఆధారిత నైపుణ్యం, పట్టణీకరణలో దేశం ఎంతో పురోగతి సాధించింది’ అని కొనియాడారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అంతర్గత భద్రత కూడా మెరుగుపడిందన్నారు. గతంలో 11 జిల్లాలు మావోయిజం బారిన పడగా, నేడు వామపక్ష తీవ్రవాదం మూడు జిల్లాల్లో మాత్రమే ఉందని తెలిపారు. 2026 మార్చి నాటికి మావోయిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. అంతేగాక 2027 నాటికి దేశం మూడో ఆర్థిక వ్యవస్థగానూ అంతరిస్తుందని తెలిపారు. గత 11 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని గుర్తు చేశారు.






