Amith shah: భద్రతా బలగాలను చూసి దేశం గర్విస్తోంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by B.Srinivas |

కర్రెగుట్ట ఎన్ కౌంటర్‌లో భద్రతా బలగాలు సాధించిన విజయం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు.

Amith shah: భద్రతా బలగాలను చూసి దేశం గర్విస్తోంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్రెగుట్ట ఎన్ కౌంటర్‌లో భద్రతా బలగాలు సాధించిన విజయం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) ప్రశంసలు కురిపించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఇదొక చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. మావోయిస్టులపై ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఒకప్పుడు రెడ్ టెర్రర్ కనిపించిన కొండ మీద ఇప్పుడు త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను భద్రతా బలగాలు కేవలం 21 రోజుల్లోనే పూర్తి చేశాయి. అంతేగాక ఈ చర్యలో ఒక్క జవాన్ కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఈ విషయం పట్ల ఎంతో సంతోషిస్తున్నా. పర్వత ప్రాంతాల్లోనూ ధైర్యం, శౌర్యంతో మావోయిస్టులను ఎదుర్కొన్నందుకు అభినందిస్తున్నాం. దేశం మొత్తం భద్రతా బలగాలను చూసి గర్విస్తోంది’ అని పేర్కొన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశం నక్సల్స్ రహితంగా మారుతుందని మరోసారి దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. కాగా, తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Next Story