Amith shah: బిహార్‌లో ఎన్డీయేదే గెలుపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by B.Srinivas |

నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

Amith shah: బిహార్‌లో ఎన్డీయేదే గెలుపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేసిందని, గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరన్ జిల్లాలో శుక్రవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి హయాంలో ఉన్న జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా నితీశ్ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. లాలూ, రబ్రీ పాలనలోని రోజులకు రాష్ట్ర యువత గుర్తుంచుకోవాలన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. నితీశ్ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీజేపీతో పాటు బీహార్ ప్రజలు కూడా ఆయనపై విశ్వాసంతో ఉన్నారన్నారు.

బిహార్‌కు ఈ సారి నాలుగు దీపావళిలు

‘ఈ ఏడాది బిహార్ ప్రజలు నాలుగు దీపావళి పండుగలు జరుపుకునే అవకాశం ఉంది. మొదటిది రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా వచ్చేది. నితీశ్‌, మోడీ బిహార్‌లోని మహిళలకు రూ. 10,000 విరాళం ఇవ్వడంతో రెండో దీపావళి ముగిసింది. మూడో దీపావళి 395 ఉత్పత్తులపై జీఎస్టీని 5 శాతం, 0 శాతానికి తగ్గించడం, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగో దీపావళి జరుపుకుంటారు’ అని చెప్పారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనతో ఉగ్రవాదం అభివృద్ధి చెందడానికి అనుమతించారని ఆరోపించారు. కానీ ఎన్డీయే హయాంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టి టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేశామని గుర్తు చేశారు.

Next Story