- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: హిందీ ఏ భారతీయ భాషకూ శత్రువు కాదు.. కేంద్ర మంత్రి అమిత్ షా
హిందీ ఏ భారతీయ భాషకూ శత్రువు కాలేదని, అది అన్ని భాషలకు ఫ్రెండ్‌లాంటిదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిందీ ఏ భారతీయ భాషకూ శత్రువు కాలేదని, అది అన్ని భాషలకు ఫ్రెండ్‌లాంటిదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) చెప్పారు. అన్ని భాషలను సుసంపన్నం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గురువారం జరిగిన అధికార భాష శాఖ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. హిందీ, అన్ని భారతీయ భాషలు ఉపయోగించి ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి భాషనూ అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. విదేశీ భాషలను సైతం ఎప్పుడూ వ్యతిరేకించకూడదని, కానీ మన భాషలో మాట్లాడటం కొనసాగించాలని సూచించారు. మన భాషలు వారసత్వాన్ని వ్యక్తీకరించడానికి కీర్తించబడినప్పుడే పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు.
ప్రాంతీయ భాషల్లో మెడిసిన్ (Medicine), ఇంజనీరింగ్ (Engineering) విద్యను అన్ని రాష్ట్రాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మాతృ భాషను విస్మరించిన ఏ దేశమూ ముందుకెళ్లలేదన్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమం మాత్రమే కాదని, అది జాతి ఆత్మ అని కొనియాడారు. కాబట్టి భారతీయ భాషలను సజీవంగా, అభివృద్ధి చెందేలా ఉంచడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో అన్ని భారతీయ భాషల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.






