- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: ముస్లిం ఓట్ల కోసమే విమర్శలు.. మమతా బెనర్జీపై అమిత్ షా ఫైర్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకే మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆపరేషన్ సిందూర్ , వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల మమతా దేశంలోని తల్లులు, సోదరీమణులను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కోల్‌కతాలో పార్టీ నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) ను విమర్శించినందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని మహిళలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించడమే గాక జాతీయ భద్రతతోనూ ముడిపడి ఉన్నాయన్నారు.
మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను తెరిచి చొరబాట్లను అనుమతిస్తున్నారన్నారు. చొరబాట్లను ఆపడంలో టీఎంసీ విఫలమైందని ఆరోపించారు. దీని వల్ల టీఎంసీ ఓటు బ్యాంకు పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. మమతా మేనళ్లుడు తదుపరి సీఎం అవుతారని భావిస్తున్నారని కానీ ఇది జరగబోదని స్పష్టం చేశారు. 2026లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, అనంతరం చొరబాట్లు ఆగుతాయని నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్‌కు అవసరమైన భూమిని కేటాయించిన తర్వాత చొరబాట్లు ఆగిపోతాయని, కానీ మమతా బెనర్జీ ఆ పని చేయలేదని తగినంత భూమి ఇవ్వలేదని మండిపడ్డారు.






