- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah : వారిని అంతం చేసేదాకా ఆపేది లేదు : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amitha Sha) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amitha Sha) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజాన్ని(Naxalism) పూర్తిగా తరిమివేసే 'ఆపరేషన్ కగార్'(Oparetion Kagar)ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నక్సలిజాన్ని తుదముట్టించే వరకు భద్రతా బలగాల దాడులు జరుగుతూనే ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ కాల్పులు విరమించేది లేదని తేల్చి చెప్పారు. కాగా 2026 మార్చి 31 వరకు నక్సల్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చి దిద్దుతామని ఇదివరకే అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో పలుచోట్ల దాదాపు ప్రతిరోజూ ఎన్కౌంటర్స్ జరుగుతుండగా.. మావోలను ఏరి పారేయడమే తమ లక్ష్యమని సోమవారం అమిత్ షా స్పష్టం చేశారు.
అయితే నేడు జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్(Jarkhand Encounter) పై స్పందిస్తూ.. ఈ ఎన్కౌంటర్లో రూ. 1 కోటి రివార్డు కలిగిన వివేక్(Moist Vivek) అనే మావోయిస్టుతో సహ మరో ఇద్దరు కీలక నేతలు హతమైనట్టు తెలిపారు. అమిత్ షా ఆపరేషన్ కగార్ ప్రకటన నేపథ్యంలో భారీగా నక్సల్స్ లొంగిపోతున్నారు. అలాగే అనేకమంది భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నారు.






