- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింధూ నది నుంచి ఒక్క చుక్క కూడా పాక్కు వెళ్లకుండా ప్లాన్.. అమిత్ షా మరో సంచలన ప్రకటన
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్(Pakistan) మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్(Pakistan) మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అంతేకాదు.. సింధూ నది(Indus River Waters) నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాక్కు వెళ్లకుండా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సింధూ నదీజలాలపై ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు.
జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఉన్నతాధికారులతో అమిత్ షా(Amit Shah) భేటీ అయ్యారు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం గురించి చర్చించారు. మూడు దశల్లో సింధూ జలాలు పాక్కు దక్కకుండా ప్లాన్ చేశారు. మొదట ప్రపంచ బ్యాంక్కు మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించారు. కాగా, సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ (India), పాకిస్థాన్‌ల మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. దీనికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సంతకం చేశారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రపంచ బ్యాంక్కు భారత్ వైఖరిని తెలియజేయాలని నిర్ణయించారు.
సింధూ నది ఒప్పంద వివరాలు :
భారత్ - పాకిస్తాన్ మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు సంతకాలు చేశారు. ఆ తర్వాత ఈ సింధూ నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించింది. ఒప్పందం ప్రకారం.. తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ అనే 3 నదులపై భారత్‌కు నియంత్రణ ఉంటుంది. మరోవైపు.. సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్‌కు అప్పగించారు. అయితే 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. గతంలోనూ 1948లో పాక్‌కు భారత్ నీటి సరఫరాను ఆపేసింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో మళ్లీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదిలో 20 శాతం నీటిని భారత్.. 80 శాతం నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.






