- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా సరికొత్త రికార్డు.. అసలు విషయం ఇదే!
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతోన్న అమిత్ షా (Amit Shah) సరికొత్త రికార్డును సృష్టించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతోన్న అమిత్ షా (Amit Shah) సరికొత్త రికార్డును సృష్టించారు. భారత దేశ రాజకీయాల్లో ఏ నేత అందుకోలేని ఫీట్ సాధించారు. సుధీర్ఘ కాలం కేంద్ర హోంమంత్రిగా (Central Home Minister) పని చేసిన వ్యక్తిగా అమిత్ షా నిలిచారు. ఇప్పటి వరకు ఎల్‌కే అద్వానీ (LK Advani) పేరుతో ఉన్న రికార్డును షా బద్దలు కొట్టారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్‌షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడంతో అమిత్ షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు. ఆయన హోమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి ఆరు సంవత్సరాల 69 రోజులు పూర్తి అయింది. గతంలో కేంద్ర హోం మంత్రిగా ఎల్‌కే అద్వానీ ఆరేళ్ల 64 రోజులు (2,254) పనిచేయగా.. ప్రస్తుతం అమిత్ షా ఆరేళ్ల 69 రోజులుగా (2,259) కేంద్ర హోం మంత్రిగా కొనసాగుతున్నారు.






