- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాంటి దాడినైనా తిప్పికొడతాం.. పూంచ్‌లో ప్రజలకు అమిత్ షా హామీ
ఎలాంటి దాడినైనా తిప్పికొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. పూంచ్‌లో పాక్ దాడుల బాధితులను ఆయన కలిశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడి చేశాయని, ఇలా చేయడం ఇదే తొలిసారని హోంమినిస్టర్ అమిత్ షా చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్ దళాలు సరిహద్దు ప్రాంతాలపై భీకరంగా కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 18 మంది చనిపోగా చాలామంది గాయపడ్డారు. పూంచ్‌లో బాధితులను కలిసిన అమిత్ షా.. మరణించిన కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని సాధారణ ప్రజలు, ఆధ్మాత్మిక ప్రాంతాలనై పాకిస్తాన్ దాడులు చేసింది’ అని ఆయన గుర్తుచేశారు. పహెల్గాంలో పాక్ ఉగ్రవాదులు పిరికిపందల్లా అమాయకులైన ప్రజలపై దాడులు చేశారని షా చెప్పారు.
‘ఉగ్రదాడులపై ప్రతిస్పందన తీవ్రంగా ఉండాలనేది ప్రధాని మోడీ పాలసీ. దీని ప్రకారమే ఆపరేషన్ సిందూర్ జరిగింది. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పీవోకే, పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం అని చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ షెల్లింగ్‌లో పూంచ్ చాలా నష్టపోయిందని, పాక్ సైన్యాలు ఇక్కడి గురుద్వారాలు, ఆలయాలు, మసీదులను టార్గెట్ చేశాయని చెప్పారు. భారత్‌పై ఎలాంటి దాడి జరిగిన చూస్తూ ఊరుకునేది లేదని, చాలా కచ్చితమైన గట్టి సమాధానం ఇస్తామని పాక్‌కు షా వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టే సామర్థ్యం భారత సైన్యానికి ఉందన్నారు. అలాగే 2014 తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొదలైన అభివృద్ధికి ఎలాంటి ఆటంకం రాదని హామీ ఇచ్చారు.






