ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన అమిత్ షా.. జమ్మూకశ్మీర్ CM సహా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-22 16:21:57  IST  )

ఉగ్రదాడి(Terror Attack)లో గాయపడిన బాధితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు.

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన అమిత్ షా.. జమ్మూకశ్మీర్ CM సహా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రదాడి(Terror Attack)లో గాయపడిన బాధితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir CM Omar Abdullah) సహా అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. కాల్పులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అంతకుముందు దాడి ఘటనపై అమిత్ షా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘పర్యటకులపై దాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి ప్రధాని మోడీకి వివరించాను. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించాను.’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Next Story