- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amith Sha Apologize : తమిళులకు అమిత్ షా బహిరంగ క్షమాపణలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) తమిళ ప్రజలకు బహిరంగ క్షమాపణలు(Apologize) తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) తమిళ ప్రజలకు బహిరంగ క్షమాపణలు(Apologize) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జాతీయ విద్యా విధానం(National Education Policy)పై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం (Tamilanadu vs Central Govt) మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ స్వయంగా అమిత్ షా తమిళులకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. బుధవారం కోయంబత్తూర్ లోని ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష తమిళం(Tamil) అని, అలాంటి మహోన్నత భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలి తమిళ ప్రజలను కోరారు.
వచ్చే ఎన్నికల్లో డీఎంకే(DMK) ఓటమి పాలయ్యి, తమిళనాడులొ ఎన్డీఏ(NDA) ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చరిత్రలో 2024 మరపురాని ఏడాది అని పేర్కొన్నారు. ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రజలు తమపై సంపూర్ణ నమ్మకంతో అధికారం కట్టబెట్టారని.. దానిని నిలబెట్టుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. కాగా జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోని విద్యార్థులంతా తప్పనిసరిగా హిందీ, ఇంగ్షీషు, ఒక స్థానిక భాష నేర్చుకోవాలని కేంద్రం త్రిభాషా విధానాన్ని తీసుకు వచ్చింది. అయితే తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని, హిందీ బలవంతంగా రుద్దితే ఊరుకోమని డిఎంకే కేంద్రానికి స్పష్టం చేసింది.






