- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులను చంపాలనే ఉద్దేశం మాకు లేదు.. అమిత్ షా మరో కీలక ప్రకటన
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నక్సల్ రహిత భారత్' పేరిట నిర్వహించిన భారత్ మంథన్-2025 కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల విరమణ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులు(Maoists) ఆయుధాలు విడిచిపెట్టాల్సిందే అని అన్నారు. లొంగిపోవాలనుకుంటే కాల్పుల విరమణ అవసరం లేదని చెప్పారు. లొంగిపోయిన వారికి తప్పకుండా పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భారత్‌లో మావోయిజం కేవలం ఆయుధాలతోనే అంతం కాదని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మావోయిజం వెనుక ఉన్న సిద్ధాంతాలపై పోరాటం చేయాలని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో 2026 మార్చి 31 నాటికి భారత్‌లో పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. మావోయిస్టులను చంపాలనే ఉద్దేశం తమకు లేదని.. అరెస్ట్ చేసే అవకాశం వస్తే తప్పకుండా వారిని అదుపులోకి తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలతో 881 మంది సరెండర్ అయ్యారు.. వారికి పునరావాసం కల్పించామని అన్నారు.






