- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పేలుడు వెనుక టెర్రరిస్టుల హస్తం...క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
సంఘటన వెనుక టెర్రరిస్టుల హస్తం క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. ఈ సంఘటనకు కారణాలు ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ( Delhi explosion) సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ దారుణమైన సంఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన జరగగానే రంగంలోకి అమిత్ షా ( Amit Shah) దిగారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేలుడు సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ సంఘటన వెనుక టెర్రరిస్టుల హస్తం ఉందా ? అని రిపోర్టర్లు అడిగితే, దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. ఈ సంఘటనకు కారణాలు ఇప్పుడే చెప్పలేమని, అది చాలా కష్టమని అమిత్ షా వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత, దీనిపై క్లారిటీ ఇస్తామని వివరించారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన శాంపిల్స్ ను విశ్లేషించిన తర్వాత కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు అమిత్ షా. ఇక అటు ఈ సంఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు ప్రధాని మోడీ.






