దేశంలోనే అత్యంత అసమర్థ హోంమంత్రి అమిత్ షా: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

by Malleboina Mahesh |   (  Updated:2025-11-11 07:21:37  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు స్పందిస్తున్నారు.

దేశంలోనే అత్యంత అసమర్థ హోంమంత్రి అమిత్ షా: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) స్పందిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. “స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత అసమర్థ హోంమంత్రి అమిత్ షా. ఏ ఇతర దేశంలోనైనా ఇంత పెద్ద భద్రతా వైఫల్యం చోటు చేసుకుంటే.. ఆ శాఖ మంత్రిని కేబినెట్‌ నుండి బహిష్కరించేవారు.

కానీ ఇక్కడ ఆయన ప్రధాని మోడీ రహస్యాలను పంచుకునే వ్యక్తి కావడం వల్ల అపరివార్యుడయ్యారు” అని తీవ్ర విమర్శలు చేశారు. “దేశ హోం మంత్రి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఆయన పని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమా? కేవలం రాజకీయాల కోసమేనా ఆయన పదవి? ప్రజల ప్రాణాలు పోతున్నా ఆయనపై ఎవరూ చర్యలు తీసుకోరా? ఇంకెన్ని ప్రాణాలు ఆయన అసమర్థత కారణంగా కోల్పోవాలి?” అంటూ ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story