- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు అండగా ఉంటాం: అమిత్ షా
by Phanindra |
భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి కేంద్రం అండగా ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలతో సతమతం అవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు అన్నివిధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ వర్షాల నేపథ్యలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్‌తో మాట్లాడానని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి సాయం అవసరమైనా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు.
భారీ వర్షాలతో పలు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో వర్షాల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అస్సాంలోని సుమారు 20 జిల్లాల్లో 80 వేలమందికిపైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.
Next Story






