- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ఎర్రకోట వద్దకు అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు(Delhi Explosion) ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు(Delhi Explosion) ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పేలుడపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దగ్గర్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సహా ఉన్నతాధికారులు అందరితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. హోండా I20 కారులో పేలుడు సంభవించిందని స్పష్టం చేశారు. కాసేపట్లో పేలుడు ఘటన ప్రాంతానికి రాబోతున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఇప్పటికే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సోమవారం సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.






