- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Babas..Nisha : బాబాలకు హీరోయిన్ అమీషా..నిషా!
మేం సాధు సంతులం...సన్యాసులం(Sanyasulu)..బాబాలం(Babalu)..సర్వసంగ పరిత్యాగులం..అంటూ బిల్డప్ లు ఇచ్చే వారు కూడా మేనక విశ్వామిత్ర ఎపిసోడ్ ను తలపిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : మేం సాధు సంతులం...సన్యాసులం(Sanyasulu)..బాబాలం(Babalu)..సర్వసంగ పరిత్యాగులం..అంటూ బిల్డప్ లు ఇచ్చే వారు కూడా మేనక విశ్వామిత్ర ఎపిసోడ్ ను తలపిస్తుంటారు. సన్యాసులుగా మహిళల పట్ల నిష్టగా వ్యవహరించాల్సిన బాబాలు అందాల హీరోయిన్ ను చూడగానే ఒళ్లు మరిచి సన్యాసం గట్టున పెట్టి ఆమెతో సెల్ఫీలకు పోటీలు పడిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శివరాత్రి సందర్భంగా ముంబైలోని జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్(Bollywood heroine Amisha Patel)కు సన్యాసులు, బాబాలతో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. దైవ దర్శనానికి వచ్చిన అమీషా పటేల్ కు ఇబ్బందికలిగేలా ఆలయం వద్ద ఆమెతో సెల్ఫీ దిగేందుకు బాబాలు పోటీ పడ్డారు. ఆమెను చుట్టుముట్టి ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. సెల్ఫీల కోసం ఎగపడటంతో ఆమె ఇబ్బంది పడ్డారు. అసలే బాబాలు..వారిపై కోపం ఎందుకనుకున్నారో ఏమో కొంతసేపు తనకు ఇబ్బందికరమైనప్పటికి సహనంతో వారి సెల్ఫీ పైత్యానికి అడ్డుచెప్పలేదు.
ఈ వ్యవహారం గమనించిన ఆలయ సిబ్బంది జోక్యం చేసుకుని హీరోయిన్ అమీషా పటేల్ ను ఇబ్బందిపెట్టేలా సెల్ఫీల కోసం పోటీపడుతున్న బాబాలను లాగిపారేసి ఆమెను ముందుకు పంపించారు. అయినా ఆమె కారు ఎక్కేదాకా ఫోటోల కోసం అనుసరించారు. ఇందుకు సంబంధించిన బాబాల నిర్వాకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు ఎంతవారలైన కాంతాదాసులేనని...బ్రహ్మకైన పుడుతుంది రిమ్మ తెగులన్న సామేతలను గుర్తు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు సాధుసంతులు..బాబాలందు పుణ్య సాధువులు..బాబాలు వేరయా అంటూ చమత్కరిస్తున్నారు.






