- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు మైండ్ బ్లాంక్.. ఇరాక్ భూభాగంలో కూలిన KC-135 విమానం
అగ్రదేశం అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. KC-135 యుద్ధ విమానం ఇరాక్ భూభాగంలో కుప్పకూలింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ ఇరాక్ (Iraq) భూభాగంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానం కూలిపోవడం కలకలం రేపుతోంది. అమెరికా (America) వైమానిక దళానికి చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ రీఫ్యూయలింగ్ విమానం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారని ఇరాన్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికా విమానాన్ని తామే కూల్చివేసినట్లు కొన్ని ఇరాన్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
అమెరికా రియాక్షన్..
అయితే, ఇరాన్ వాదనలను అమెరికా రక్షణ శాఖ (Pentagon) తోసిపుచ్చింది. విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని, అయితే ఇది శత్రువుల దాడి (Hostile Fire) వల్ల జరగలేదని స్పష్టం చేసింది. సాంకేతిక లోపం లేదా ప్రమాదవశాత్తూ రెండు విమానాలు ఒకదానికొకటి తగిలి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో మరొక విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఈ విమానం విధులు నిర్వహిస్తోంది. విమానంలో ఉన్న ఐదుగురు లేదా ఆరుగురు సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.






