- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికన్ ఎయిర్ లైన్స్ లో మంటలు
విమాన ప్రయాణం చేయాలంటేనే జంకాల్సిన పరిస్థితి. బుధవారం (జూన్ 25) ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తింది.

దిశ, వెబ్‌డెస్క్: విమాన ప్రయాణం చేయాలంటేనే జంకాల్సిన పరిస్థితి. బుధవారం (జూన్ 25) ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఈ ఘటనతో పైలట్ అప్రమత్తమై.. లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు.
సాంకేతిక లోపం కారణంగా విమానం గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్ చుట్టూ మంటలు, పొగలాంటి దృశ్యాలు కనిపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ – "ఇది ఒక సాంకేతిక సమస్య మాత్రమే. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని జరగలేదు" అని తెలిపింది. అయితే.. ఇంజిన్‌లో మంటలు కనిపించినట్లు ఎలాంటి అధికారిక నివేదికలైతే లేవని చెప్పినా.. పలు మీడియా సంస్థలు విడుదల చేసిన వీడియోల్లో మాత్రం ఇంజిన్ నుంచి చిన్నగా మంటలు రావడాన్ని చూడవచ్చని వెల్లడించాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం.






