- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమర్నాథ్ యాత్ర.. కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం
అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yathra) జూన్ 13 నుంచి ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yathra) జూలై 3 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)కు రానున్నారు. అయితే, అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు జమ్మూలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటలను జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగనుంది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌లో కేంద్ర సాయుధ పోలీసు దళాలకు (CAPF) చెందిన సుమారు 581 కంపెనీల సిబ్బందిని డిప్లాయ్ చేయనున్నారు. అయితే, ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో 91 సీఆర్పీఎఫ్ (CRPF), 13 బీఎస్ఎఫ్ (BSF), ఇతర సీఏపీఎఫ్ (CAPF)ల యూనిట్లు పహారా కాస్తున్నాయి. మరో 425 కంపెనీల బలగాలను అక్కడి పంపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తక్షణమే కేంద్ర బలగాలు జమ్మూకశ్మీర్‌లో పొజిషన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.






