- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీని గద్దె దింపేందుకే "వోట్ చోరీ" ఆరోపణ : బీజేపీ
by Muthe.Rajitha |
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వోట్ చోరీ ధర్నాపై బీజేపీ మండిపడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వోట్ చోరీ ధర్నాపై బీజేపీ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీని పదవి నుంచి దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ బురద జల్లుతోందని భాజపా ఆరోపించింది. వోట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో కార్యకర్తలు ప్రధాని మోదీపై చేసిన వివాదాస్పద నినాదాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీ SIR కు వ్యతిరేకంగా కాదని, అసలు ఎజెండా ప్రధాని మోడీని పదవి నుంచి తొలగించడమేనని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు వందలసార్లు ప్రధానిపై విమర్శలు చేశారని, ఇకపై వారు చేసే తప్పులను ప్రజలు క్షమించరని అన్నారు. మోడీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసినంత కాలం కాంగ్రెస్ ను సహించరని అన్నారు.
Next Story






