Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

‘ఏదో కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు’ అని బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా (Sheikh Hasina) ఎమోషనల్ అయ్యారు.

Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఏదో కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు’ అని బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా (Sheikh Hasina) ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా, ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే విషయంపై మౌనం వీడారు. త్వరలోనే ఆమె తిరిగి బంగ్లాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. సోషల్ మీడియోలో ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. షేక్ హసీనా మాట్లాడుతూ.. ‘‘ఏదో కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉండండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను’’ అని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, తన తండ్రి, బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు షేక్‌ ముజిబర్ రెహమాన్ సహా తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తుచేసుకున్నారు. ఒక్క రోజులోనే తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయానని చెప్పారు. అప్పుడు వారు దేశంలోకి తమని రానివ్వలేదన్నారు. సొంత వారిని కోల్పోయి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న ఆవేదనను అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. తన ద్వారానే ప్రజలకు మంచి చేయాలని భగవంతుడు ఆశిస్తున్నాడేమో.. అందుకే తనని కాపాడుతున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. తాను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

యూనస్ పై విమర్శలు

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus)పై హసీనా తీవ్ర విమర్శలు చేశారు. యూనస్ కు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి.. యూనస్ మాత్రం విదేశాల్లో లగ్జరీ జీవితం గడిపారని మండిపడ్డారు. అప్పట్లో ఆయన తీరుని అర్థం చేసుకోలేక.. దేశం ఎంతో సాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హసీనా మాట్లాడుతూ..‘‘యూనస్‌ వల్ల ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది. యూనస్ సారథ్యంలో బంగ్లా ఉగ్రదేశంగా మారింది. ఆవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు.. ఇలా ఎంతోమందిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో లైంగిక వేధింపుల ఘటనలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ, మీడియాను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో ఈదారుణాలు బయటకు రావట్లేదు’’ అని యూనస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

Next Story