- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్ఐ) నూతన కమిటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా హర్యానాకు చెందిన సీఎన్ భారతి, తెలంగాణకు చెందిన చావా రవిలను ఎన్నుకున్నారు.

- ఎస్‌టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి
- టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న చావా రవి
దిశ, తెలంగాణ బ్యూరో : స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్ఐ) నూతన కమిటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా హర్యానాకు చెందిన సిఎన్ భారతి, తెలంగాణకు చెందిన చావ రవిలను ఎన్నుకున్నారు. కలకత్తా నగరంలోని మహాజాతి సదన్ లో గత మూడు రోజులుగా ఆల్ ఇండియా రజతోత్సవ మహాసభల నిర్వహించారు. ఆదివారం మూడవరోజు ముగింపులో ఎస్ టి ఎఫ్ ఐఆల్ ఇండియా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో 87 మంది జనరల్ కౌన్సిల్ సభ్యులుగా, 45 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా, 23 మంది ఆఫీస్ బేరర్స్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సిఎన్ భారతి (హర్యానా) అధ్యక్షుడుగా, చావ రవి(తెలంగాణ) ప్రధాన కార్యదర్శిగా, మరొక 21 మంది ఆఫీసు బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ లో మహిళా ప్రతినిధిగా సిహెచ్ దుర్గా భవాని, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎ. వెంకట్, ఆర్.శారద ఎన్నికయ్యారు. వీరు మూడు సంవత్సరాల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రస్తుతం చావా రవి టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న చావ రవి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన టీఎస్‌యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, ఉపాధ్యక్షులు సిహెచ్. దుర్గ భవాని, కోశాధికారి టి .లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతి కుమారి, నాగమణి, రాజు, రంజిత్ కుమార్, సత్యానంద్, మల్లారెడ్డి, శ్రీధర్, రవి ప్రసాద్ గౌడ్, రవికుమార్, సింహాచలం, జ్ఞాన మంజరి, వెంకటప్ప అభినందనలు తెలిపారు.






