మోడీ సొంత రాష్ట్రంలో సంచలన పరిణామం.. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా

by Prasad Jukanti |

ప్రధాని మోడీ సొంత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

మోడీ సొంత రాష్ట్రంలో సంచలన పరిణామం.. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వంలో (Gujarat politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) మినహా మిగతా మంత్రులంతా తమ కేబినెట్ పోస్టులకు రాజీనామా (Gujarat cabinet resignations) చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వీరంతా రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్తవారిని అధిష్టానం ఎంపిక చేయనుంది. కాగా కొత్త కేబినెట్ శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో పదవిలో కొనసాగుతున్న ఏకైక సభ్యుడు సీఎం భూపేంద్ర పటేల్ ఒక్కరే కావడం విశేషం.

Next Story