- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్‌లో ‘నీట్’ రాసే అభ్యర్థులకు అలర్ట్.. ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన
భవిష్యత్తులో ‘నీట్’ విద్యార్థులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ (యూజీ)’ ప్రవేశ పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేయబోతోంది. పేపర్ లీకేజీలు, అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వచ్చే ఏడాది అంటే 2027 నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
‘రాధా కమిటీ’ సిఫార్సుల అమలు..
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాధా కమిటీ’ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మంత్రి ధర్మేద్ర ప్రధాన్ వెల్లడించారు. పరీక్షల భద్రతను పటిష్టం చేసేందుకు రాధా కమిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానాన్ని సిఫార్సు చేసిందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌ను పూర్తిగా సీబీటీ విధానంలోనే నిర్వహించడానికి తాము సన్నద్ధమవుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఇకపై ఈ ఆన్‌లైన్ విధానానికి అనుగుణంగానే తమ ప్రిపరేషన్‌ను సాగించాలని ఆయన సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు. మరోవైపు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, ఆయనకు ఆత్మన్యూనతా భావం ఉందంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






