దేశ ప్రజలకు అలర్ట్.. 126 రోజుల తర్వాత మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

by Disha Web Desk 12 |
దేశ ప్రజలకు అలర్ట్.. 126 రోజుల తర్వాత మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కనుమరుగైందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతుంది. నెమ్మదిగా ప్రజల్లో వ్యాపిస్తుండటంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో శనివారం 843 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. కాగా దాదాపు 126 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 800 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, క్రియాశీల కేసుల సంఖ్య 5,389కి చేరుకుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఒక్కొక్కరితో సహా నలుగురు మరణాల సంబవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,30,799 చేరింది. ఈ వారం ఆరు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.

Also Read..

సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యం: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్



Next Story