- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిలేష్ యాదవ్ 'మాన్ సూన్ ఆఫర్': 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి..
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ లోకసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి తక్కువ స్థానాలు రావడంతో రాష్ట్రంలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ లోకసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి తక్కువ స్థానాలు రావడంతో రాష్ట్రంలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వివాదాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గురువారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మాన్‌సూన్ ఆఫర్: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేయండి’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ అన్నారని తెలుస్తుంది. బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
అఖిలేష్ యాదవ్ ఇలాంటి ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో డిసెంబర్ 2022లో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లకు "100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి రాష్ట్రానికి సీఎం కావాలని" ఆఫర్ చేశారు. రాష్ట్రంలో బీజేపీలో జరుగుతున్న అంతర్గత పోరు పై కేంద్రం నాయకత్వం కూడా తాజాగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ దేశంలోనే అత్యంత కీలకమైన యూపీలో పార్టీ నాయకులు ఐక్యంగా ఉండాలని కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు గాను భాజపా 33 మాత్రమే గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలను కైవసం చేసుకుంది.






