Akash Prime: వైమానిక రక్షణకు నూతన శక్తి.. ఆకాశ్ ప్రైమ్ పరీక్ష సక్సెస్

by B.Srinivas |

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ ప్రైమ్ వైమానిక రక్షణ వ్యవస్థను 15,000 అడుగుల ఎత్తులో సైన్యం విజయవంతంగా పరీక్షించింది.

Akash Prime: వైమానిక రక్షణకు నూతన శక్తి.. ఆకాశ్ ప్రైమ్ పరీక్ష సక్సెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక సామర్థ్యం మరింత బలంగా మారనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ ప్రైమ్ (Akash prime) వైమానిక రక్షణ వ్యవస్థను 15,000 అడుగుల ఎత్తులో సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ప్రయోగం జరగగా సక్సెస్ అయినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఎత్తైన ప్రాంతంలో వైమాణిక లక్ష్యాలను ఢీకొట్టాయి.

తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాయని అధికారులు తెలిపారు. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లు, యుద్ధ విమానాలను ఇది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఆకాశ్ ప్రైమ్ సిస్టమ్ భారత రక్షణ సైన్యంలో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మూడో, నాలుగో రెజిమెంట్లలో భాగం కానుంది. దీంతో స్వదేశీ వైమానిక రక్షణను బలోపేతం చేయడంలో, అధిక ఎత్తులో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంలో మరో మైలురాయి కానుంది.

Next Story