Akash: బీఎస్పీలోకి ఆకాష్ ఆనంద్.. వెల్లడించిన పార్టీ చీఫ్ మాయావతి !

by B.Srinivas |

బీఎస్పీ నుంచి ఇటీవల సస్పెండైన పార్టీ చీఫ్ మాయావతి మేనళ్లుడు ఆకాష్ ఆనంద్ తిరిగి పార్టీలో చేరనున్నారు.

Akash: బీఎస్పీలోకి ఆకాష్ ఆనంద్.. వెల్లడించిన పార్టీ చీఫ్ మాయావతి !
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి ఇటీవల సస్పెండైన పార్టీ చీఫ్ మాయావతి మేనళ్లుడు ఆకాష్ ఆనంద్ (Aakash anand) తిరిగి పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని మాయావతి (Mayawathi) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘ఆకాష్ తన తప్పులను బహిరంగంగా అంగీకరించారు. పార్టీలోని సీనియర్లకు పూర్తి గౌరవం ఇవ్వడం, తన మామ మాటలకు లొంగకుండా జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తానని తెలిపారు. దీంతో ఆకాష్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నంత కాలం కాన్షీరామ్ లా పూర్తి అంకిత భావంతో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరినీ వారసులుగా నియమించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

అంతకుముందు ఆకాష్ ఆనంద్ మాయావతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తన తప్పులన్నింటినీ క్షమించి మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని మాయావతికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇంకెలాంటి తప్పూ చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే మాయావతి అందుకు అంగీకరించింది. కాగా, మార్చి 3న ఆకాష్ ను పార్టీ నుంచి మాయావతి బహిష్కరించారు. దీంతో తిరిగి ఆయన పార్టీలో చేరనున్నారు.

Next Story