Ajit Pawar Plane Crash: కరా-నీరా సంగమంలో అజిత్ పవార్ అస్థికల నిమజ్జనం

by Ramesh Naini |

Ajit Pawar Plane Crash: కరా-నీరా సంగమంలో అజిత్ పవార్ అస్థికల నిమజ్జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దివంగత అజిత్ పవార్ అస్థికల నిమజ్జన కార్యక్రమం బారామతి సమీపంలోని సోంగావ్ వద్ద జరిగింది. శుక్రవారం కరా- నీరా నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అజిత్ పవార్ కుమారులు పార్థ్ పవార్, జే పవార్ సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించి, తండ్రి అస్థికలను నదీజలాల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బరువెక్కిన హృదయాలతో కుటుంబ సభ్యులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కాగా, బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. విమానం ల్యాండ్ కావడానికి చేసిన రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Next Story