Ajay Maken : కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా అజయ్ మాకెన్

by Kema Shiva Kumar |   (  Updated:2023-10-02 08:01:01  IST  )

కాంగ్రెస్ పార్టీ నూతన ట్రెజర‌ర్‌గా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత అజయ్ మాకెన్‌ నియమితులయ్యారు.

Ajay Maken : కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా అజయ్ మాకెన్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ నూతన ట్రెజర‌ర్‌గా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత అజయ్ మాకెన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయం నుంచి అధికారికంగా వార్త వెలువడింది. జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అయితే, పదవీ విరమణ చేసిన కోశాధికారి పవన్ కుమార్ బన్సాల్ పార్టీకి అందించిన సేవలు, సహకారాన్ని పార్టీ అభినందిస్తోందని ఆయన తెలిపారు.

Next Story