- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPSC చైర్మన్‌గా అజయ్ కుమార్.. రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉత్తర్వులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్‌గా మాజీ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ (Ajay Kumar) నియమితులయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్‌గా మాజీ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ (Ajay Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగిన ప్రీతి సుదాన్ పదవీ కాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో ఆమె స్థానంలో అజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1985 ఐఏఎస్ బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన అజయ్ కుమార్ 2019 ఆగస్టు 23, నుంచి అక్టోబర్ 31, 2022 వరకు డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
Next Story






