- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airspace Closure: పాక్ విమానాలకు గగనతలం మూసివేత.. అక్టోబర్ 24వరకు పొడిగింపు
పాకిస్తాన్ విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Pakistan flights) పాకిస్తాన్ విమానాలపై ఉన్న (Airspace closure) గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. మరోవైపు పాక్ కూడా భారత్ విమానాలకు గగనతలం మూసివేసింది. ఈ మేరకు మంగళవారం గగనతల మూసివేతను పొడిగిస్తూ రెండు దేశాలు ఎయిర్‌మెన్ (NOTAM)కు వేర్వేరు నోటీసులు జారీ చేశాయి. (Pahalgam terror attack) పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి ఇరు దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ప్రతి నెల గగనతలం మూసివేత పై ఆంక్షలు పొడిగిస్తున్న భారత్.. సెప్టెంబర్ 24 వరకు ఉన్న తేదీని అక్టోబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ నుంచే వచ్చే విమానాలుతో పాటు ఆపరేటర్లు, లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలు సహా భారత గగనతలంలోకి నిషేధం విధించారు.
కాగా, NOTAM అనేది విమాన కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బందికి సమాచారాన్ని అందించే నోటీసులు. ఏప్రిల్ 22న జమ్యూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి 26 మంది మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి పాక్‌కు గగనతలం మూసివేయబడింది.






