Operation Sindoor : గగనతలం మరో నెలరోజులు మూసివేత : పాక్ ప్రకటన

by Muthe.Rajitha |

తమ గగనతలాన్ని భారత విమానాలకు మరో నెల రోజులు మూసివేస్తున్నట్లు(Pak Airspace Closure) పాక్ ప్రకటించింది.

Operation Sindoor : గగనతలం మరో నెలరోజులు మూసివేత : పాక్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తమ గగనతలాన్ని భారత విమానాలకు మరో నెల రోజులు మూసివేస్తున్నట్లు(Pak Airspace Closure) పాక్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు, వాఘా బోర్డర్ మూసివేత, వీసా రద్దు, గగనతలాల మూసివేత వంటి చర్యలు ఉన్నాయి. ప్రతిగా పాక్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంది. అందులో ఇరు దేశాలు పరస్పరం గగనతలాలు మూసివేస్తున్నట్టు ప్రకటించుకున్నాయి. ఈ నిషేధం నెలరోజుల వరకు ఉంటుందనివెల్లడించిన పాక్.. ఇపుడు దానిని మరో నెలరోజుల పాటు పొడగించింది.

ఈ నిషేధం భారత విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస ఎయిర్, స్పైస్‌జెట్ వంటి విమానాలు పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లకుండా పొడవైన మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన వ్యయం పెరిగడమే కాకుండా.. విమాన ప్రయాణాలు అత్యంత సుదీర్ఘం అవుతున్నాయి. అయితే భారత్ కూడా తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు మూసివేసింది. దీనివల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానాలు చైనా, శ్రీలంక గగనతలం గుండా పొడవైన రూట్లు తీసుకోవాల్సి వస్తోంది. ఈ గగనతల నిషేధం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తోంది.

Next Story