- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airport incident: ఆ యువకుడిదే పొరపాటు.. భారత విదేశాంగ శాఖ
అమెరికాలోని న్యూవార్క్ ఎయిర్ పోర్టులో భారత యువకుడికి సంకెళ్లు వేసిన ఘటనపై భారత విదేశాంగ శాఖ వర్గాలు స్పందించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూవార్క్ ఎయిర్ పోర్టులో భారత యువకుడికి సంకెళ్లు వేసిన ఘటనపై భారత విదేశాంగ శాఖ వర్గాలు స్పందించాయి. ఆయనను హర్యానా (Haryana) కు చెందిన వ్యక్తిగా గుర్తించాయి. సరైన పత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించాడని, అంతేగాక ప్రయాణ సమయంలోనూ ప్రవర్తన తీరు సరిగా లేదని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ధ్రువీకరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన ప్రవర్తించిన తీరుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో ఉండగా, అతను ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రకటించిన తర్వాత భారత్ పంపనున్నారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్టు సమాచారం. అయితే చట్టవిరుద్ధంగా యూఎస్ లోకి ప్రవేశించినప్పటికీ యువకుడి పట్ల అక్కడి అధికారులు ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.






