ఢిల్లీలో దారుణంగా ఎయిర్ క్వాలిటీ.. స్కూళ్లలో అవుట్‌డోర్ యాక్టివిటీస్‌పై నిషేధం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-21 06:39:54  IST  )

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రజలు గాలి కాలుష్యంతో సతమతమవుతున్నారు.

ఢిల్లీలో దారుణంగా ఎయిర్ క్వాలిటీ.. స్కూళ్లలో అవుట్‌డోర్ యాక్టివిటీస్‌పై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రజలు గాలి కాలుష్యంతో సతమతమవుతున్నారు. తాజాగా అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 391కి చేరింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవుట్‌డోర్ యాక్టివిటీస్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ప్రముఖ పాఠశాలలు యోగా, ఇండోర్ గేమ్స్, డ్యాన్స్ క్లాసులను రద్దు చేశాయి. మరోవైపు అవుట్‌డోర్ యాక్టివిటీస్ రద్దుతో శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విధించిన నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇక వేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దిగువకు వచ్చాకే అవుట్‌డోర్ యాక్టివిటీస్‌ను అనుమతించే అవకాశం ఉంది.

Next Story