ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిన గాలి కాలుష్యం

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదివ‌ర‌కు న‌మోదైన కాలుష్యంతో పోలిస్తే రెండు మూడు రోజుల నుండి త‌క్కువ కాలుష్య స్థాయిలు న‌మోద‌వ్వ‌గా తాజాగా మ‌ళ్లీ కాలుష్యం

ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిన గాలి కాలుష్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదివ‌ర‌కు న‌మోదైన కాలుష్యంతో పోలిస్తే రెండు మూడు రోజుల నుండి త‌క్కువ కాలుష్య స్థాయిలు న‌మోద‌వ్వ‌గా తాజాగా మ‌ళ్లీ కాలుష్యం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నేడు రాజ‌ధాని న‌గ‌రంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400కిపైగా న‌మోదైంది. దీంతో ఢిల్లీని పొగ‌మంచు క‌ప్పేసింది. పొగ‌మంచు క‌మ్ముకోవ‌డంతో వాహ‌న‌దారులు సైతం ఇబ్బంది ప‌డుతున్నారు. ప‌లు రైళ్లు, విమానాల రాక‌పోక‌ల‌కు సైతం అంత‌రాయం ఏర్ప‌డింది.

దీంతో ఆల‌స్యంగా న‌డ‌వ‌నున్నాయి. ఇక కాలుష్యం కోర‌ల్లో నుండి బ‌య‌ట‌ప‌డేందుకు ఢిల్లీ ఎప్పటిక‌ప్పుడు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాది మార్చి నాటికి వాహ‌నాల‌ను ప‌రీక్షించేందుకు రెండు కొత్త ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్లు, న‌వంబ‌ర్ నాటికి ఐదు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్లు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ ఢిల్లీలోని ఝుల్ఘులిలో ఉంది. ఇది ఏడాదికి 70వేల వాహానాలను పరీక్షించే స‌మార్థ్యం క‌లిగి ఉంది. ఈ ఏడాది సీఎం రేఖ గుప్త రెండు టెస్టింగ్ కేంద్రాల‌ను ప్రారంభించారు.

Next Story