కర్ణాటకలో భారీ పెట్టుబడులు ప్రకటించిన టాటా, ఎయిర్ఇండియా

by Dishanational1 |
కర్ణాటకలో భారీ పెట్టుబడులు ప్రకటించిన టాటా, ఎయిర్ఇండియా
X

దిశ, నేషనల్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, సంస్థకు చెందిన విమాన విడిభాగాల తయారీ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భారీ పెట్టుబడులను ప్రకటించాయి. వివిధ ప్రాజెక్టుల కోసం కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ప్రకటించారు. ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా 1,650 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. మొత్తం పెట్టుబడిలో ఎయిర్ ఇండియా బెంగళూరు విమానాశ్రయాన్ని దక్షిణాదిలో ఏవియేషన్ కేంద్రంగా మార్చేందుకు, విమానాల నిర్వహణ, మరమ్మత్తు కోసం రూ. 1,300 కోట్లు పెట్టుబడి పెడుతుందని, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ రాష్ట్రంలో తయారీ, పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలను(ఆర్అండ్‌డీ) ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీని వల్ల 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తాయని, పరోక్షంగా మరో 25 వేల మంది ఉపాధి లభించవచ్చనే అంచనాలున్నాయి. టాటా పెట్టుబడులతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ రూ. 1,030 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపట్టనుంది. అందులో రూ. 420 కోట్లను ప్యాసింజర్ టూ ఫ్రైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కన్వర్షన్ ఫెసిలిటీ కోసం, గన్ తయారీ కేంద్రానికి రూ. 310 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేయనుంది. దీనివల్ల 450 మందికి ఉద్యోగాలు వస్తాయని కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed