- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ian Attacks: ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో ఇరాన్ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. విమాన ప్రయాణాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా (Air India Flights Cancelled) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఇరాన్ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. విమాన ప్రయాణాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా (Air India Flights Cancelled) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా, ఉత్తర అమెరికా, యూరప్ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల్ని తక్షణమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్ ప్రేరిత దాడులు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరగడమే కాక, గగనతలాలు కూడా మూసివేయబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఆ ప్రాంతాల మీదుగా వెళ్ళే అంతర్జాతీయ విమాన రూట్లన్నీ గందరగోళంగా మారాయి. ప్రయాణికుల సురక్షతే ప్రథమ లక్ష్యంగా భావించి.. తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
దుబాయ్, దోహా, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియా నగరాలు, న్యూయార్క్, షికాగో, టొరొంటో వంటి ఉత్తర అమెరికా నగరాలు, లండన్, పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ వంటి యూరోప్ నగరాలు.. ఈ మార్గాల్లో ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, లేదా ఫుల్ రీఫండ్ విధానం అమల్లో ఉందని సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది. ఈ నిర్ణయం తాత్కాలికమైనదేనని, భద్రతా పరిస్థితులు మెరుగయ్యాక సేవలు మళ్లీ ప్రారంభించబడతాయని ఎయిర్ ఇండియా పేర్కొంది.






