రన్‌వేపై అదుపుతప్పిన ఎయిరిండియా విమానం.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-21 07:50:38  IST  )

భారీ వర్షాల కారణంగా రన్‌ వే‌పై ల్యాండింగ్ సమయంలో ఎయిరిండియా (Air India) ఫ్లైట్ అదుపుతప్పిన ఘటన ముంబై‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

రన్‌వేపై అదుపుతప్పిన ఎయిరిండియా విమానం.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా రన్‌ వే‌పై ల్యాండింగ్ సమయంలో ఎయిరిండియా (Air India) ఫ్లైట్ అదుపుతప్పిన ఘటన ముంబై‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొచ్చిన్ (Cochin) నుంచి ముంబై‌ (Mumbai)కి వచ్చిన ఎయిరిండియా ఫ్లైట్ నెంబర్ AI 2744, రన్ వే 27‌పై అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పెలట్లు విమానాన్ని చాకచక్యంగా తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చిన సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం ఎయిర్‌పోర్టులో రన్‌వే నెం.27‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఫ్లైట్‌కు ఏమైనా డ్యామేజ్ అయిందా లేక ఇంజిన్‌లో ఏమైన సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని అధికారులు చెక్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముంబైలో భారీ వర్షాల కారణంగా ఫ్లైట్ రన్‌వేపై అదుపుతప్పినట్లుగా ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, రన్‌ వేపై అతి పెద్ద ప్రమాదం చివరగా ఆగస్టు, 2020లో కోజికోడ్‌లో చోటుచేసుకుంది. వర్షం కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిన ఘటనలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story