- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా పైలట్ చివరి సంభాషణ వైరల్.. ఏటీసీతో ఏం చెప్పారో తెలుసా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భారీ విమాన ప్రమాదం(Plane Crash) జరిగి 270 పైగా ప్రయాణికులు, సిబ్బంది మృతిచెందిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో భారీ విమాన ప్రమాదం(Plane Crash) జరిగి 270 పైగా ప్రయాణికులు, సిబ్బంది మృతిచెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఇందుకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా పైలట్ చివరి సంభాషణ వైరల్ అవుతోంది. ఏటీసీ(Air Traffic Controler)తో ఆయన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘విమానంలో పవర్ లేదు. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. మేడే మేడే’ అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి చెప్పారు. ఇదంతా ఏటీసీలో రికార్డ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.






