- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేసి తనిఖీలు
by Kema Shiva Kumar |
విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం ప్రయాణికుల్లో దడ పుట్టిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం ప్రయాణికుల్లో దడ పుట్టిస్తోంది. తాజాగా, కొచ్చి (Cochin) నుంచి ఢిల్లీ (Delhi)కి ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంటకు వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) AI 504 విమానంలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ ఆపరేషన్స్ స్టాఫ్ టేకాఫ్‌ను హుటాహుటిన క్యాన్సిల్ చేసి ప్రయాణికులు ఫ్లైట్ నుంచి దించేశారు. వారికి ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (Cochin International Airport Limited) అధికారులు వెల్లడించారు. అయితే, అదే విమానంలో కాంగ్రెస్ ఎంపీ హైబీ ఈడెన్ (MP Hibi Ede) కూడా ఉన్నారు. టేకాఫ్ అవుతోన్న క్రమంలో ఫ్లైట్ జారినట్లుగా అనిపించిందని, దీంతో అధికారులు వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
Next Story






