- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India flight Crash: విమాన ప్రమాదం.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన పోస్ట్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Air India flight crash) ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా భారత్, విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు విమానం జనావాసాల్లో, మెడికల్ కాలేజీపై కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వంద మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన పోస్ట్ చేశారు.
1950లో రైలు పట్టాలు తప్పినప్పుడు నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తుకుచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తద్వారానే స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందన్నారు. విమాన ప్రధాన ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.






