- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air india: బ్రిటన్ కుటుంబాలకు తప్పుడు మృతదేహాలు.. ఎయిర్ ఇండియాపై తీవ్ర ఆరోపణలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను సదరు కుటుంబ సభ్యులకు అందజేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను సదరు కుటుంబ సభ్యులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు తప్పుడు మృతదేహాలను అప్పగించారని బ్రిటన్‌కు చెందిన రెండు కుటుంబాలు ఆరోపించాయి. బాధితుల అవశేషాలను తప్పుగా గుర్తించి యూకేకి తరలించారని, మృతదేహాల డీఎన్ఏ కుటుంబ సభ్యులతో సరిపోలడం లేదని వారి న్యాయవాది జేమ్స్ హీలీ తెలిపారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం తమ బంధువు అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించిందని, కానీ డీఎన్ఏ పరీక్షలో శవపేటికలో వేరే ప్రయాణీకుల మృతదేహం ఉందని తేలడంతో అంత్యక్రియలను రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే మరొక కుటుంబం వారి కుటుంబ సభ్యుల అవశేషాలను మరొక ప్రయాణీకుడి అవశేషాలతో కలిపి స్వీకరించిందని తెలిపారు. ఇద్దరు బాధితుల మృత దేహాలను ఒకే శవపేటికలో ఉంచినట్లు న్యాయవాది తెలిపారు.
ఈ కథనాలపై భారత్ స్పందించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించడంలో అన్ని నియమాలను పాటించామని, ఈ అంశంపై సమస్యలను పరిష్కరించడానికి బ్రిటన్‌తో కలిసి పనిచేస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా సైతం దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా, విమాన ప్రమాదం అనంతరం 13 మృతదేహాలను యూకేకి పంపించారు.






