Air India Express: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

by S Gopi |

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ చేసింది.

Air India Express: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ చేసింది. రన్‌వేపై హార్డ్‌గా ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. అయితే, దీనివల్ల అధికారులు దాదాపు ఆరు గంటల పాటు రన్‌వేను మూసేయాల్సి వచ్చింది. ప్రమాదకర పరిస్థితుల మధ్య ల్యాండ్ అయినప్పటికీ, పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులను సురక్షితంగా దింపారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. సంఘటన తర్వాత తనిఖీ, క్లియరెన్స్ కోసం రన్‌వే మూసేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-ఫుకెట్ విమానం ఫుకెట్ విమానాశ్రయంలో నోస్ వీల్ సమస్యను ఎదుర్కొందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటన విడుదల చేసింది.

Next Story